తెలంగాణకు మళ్లీ వర్ష సూచన – దక్షిణ, తూర్పు జిల్లాలకు అలర్ట్
మురసు తుపాను శేష ప్రభావం మరియు తేమగాలుల కారణంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం నివేదిక విడుదల చేసింది.
Rain


హైదరాబాద్ , 07 నవంబర్ (హి.స.)

మురసు తుపాను శేష ప్రభావం మరియు తేమగాలుల కారణంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా దక్షిణ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో చెదురుమదురు జల్లులు పడతాయని తెలిపారు.

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి మరియు నాగర్కర్నూల్ జిల్లాలకు వర్ష హెచ్చరిక జారీ చేశారు. రాజధాని హైదరాబాద్లో ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శనివారం లేదా ఆదివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టి, రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande