
గరియాబంద్, 09 నవంబర్ (హి.స.)
దీపావళి పండుగ వేళ ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గరియాబంద్ జిల్లా రాజిమ్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగ రోజు అనగా నిన్న రాత్రి ఓ కారు అదుపుతప్పి తిలా ఆనకట్టలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. నీటిలో కారు పడిపోవడంతో నలుగురూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
పండుగ వేళ ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు