
ముజాఫర్ నగర్ (యు.పి) 09 నవంబర్ (హి.స.)
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పానిపట్-ఖతిమా జాతీయ రహదారిపై జగహేరి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది.
మంటలు భారీగా వ్యాపించడంతో కారులో ఉన్న ఆరుగురు బయటకు రాలేక సజీవదహనమయ్యారు. మృతుల్లో 10 నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
వారంతా హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..