ఎన్సీబీ అధికారుల తనిఖీలు.. రూ.23.88 కోట్ల విలువైన కొకైన్ సీజ్
బెంగళూరు, 19 ఫిబ్రవరి (హి.స.) దేశంలో మాదకద్రవ్యాల వినియోగం గుబులు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ బెంగళూరు (Bengaluru) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక రెయిడ్స్
Drugs


బెంగళూరు, 19 ఫిబ్రవరి (హి.స.)

దేశంలో మాదకద్రవ్యాల వినియోగం

గుబులు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ బెంగళూరు (Bengaluru) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక రెయిడ్స్లో ఓ బ్రెజిల్ (Brazil) దేశస్తుడి నుంచి సుమారు రూ.23.88 కోట్ల విలువైన 4.776 కిలోల కొకైన్ను అధికారులు సీజ్ చేశారు. నిందితుడు బ్రెజిల్లోని సావోపాలో (Sao Paulo) నుంచి దోహా మీదుగా బెంగళూరుకు చేరుకున్నాడు.

అయితే, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం నిందితుడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. తనిఖీల్లో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు దొరకకుండా ఉండేందుకు కొకైన్ ద్రావణంలో ముంచిన వస్త్రాన్ని (Cocaine-Infused Fabric) నాలుగు లేడీస్ హ్యాండ్ బ్యాగుల లోపలి అరల్లో దాచి తరలించే ప్రయత్నం చేశాడు. పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న NCB అధికారులు, చెక్ ఇన్ బ్యాగేజీని తనిఖీ చేయగా విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిపై NDPS (Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న వ్యక్తుల కోసం అధికారులు విచారణను ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande