బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. ఉన్నట్లుండి ఒకేసారి పెరిగిన ధరలు.. పెళ్లిళ్ల సీజన్ వేళ దెబ్బ..
ముంబై, 19 ఫిబ్రవరి (హి.స.)బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్. ధరలు తగ్గుదలకు మరోసారి బ్రేక్ పడింది. చాలా రోజుల తర్వాత ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత రెండు, మూడు వారాలుగా ధరలు పతనమవుతూ వస్తోండటంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. కానీ గురువారం ఉన్నట్లుండి
Gold


ముంబై, 19 ఫిబ్రవరి (హి.స.)బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్. ధరలు తగ్గుదలకు మరోసారి బ్రేక్ పడింది. చాలా రోజుల తర్వాత ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత రెండు, మూడు వారాలుగా ధరలు పతనమవుతూ వస్తోండటంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. కానీ గురువారం ఉన్నట్లుండి ఒక్కసారిగా పెరుగుదల నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తున్న క్రమంలో పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

గురువారం హైదరాబాద్‌లో బంగారం ధర రూ.2,290 పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,200గా ఉండగా.. ఇవాళ రూ.1,56,490కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల రేటు ప్రస్తుతం రూ.1,43,450 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,41,350 వద్ద స్థిరపడింది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో బంగారం ధర రూ.2940 పెరిగింది. నిన్న 24 క్యారెట్ల ధర రూ.1,55,240గా ఉండగా.. ఇవాళ రూ.1,58,180 వద్ద కొనసాగుతున్నాయి. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,000గా ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande