అమరావతిలో జరుగుతున్న ఏపీ శాసన మండలి.సమావేశాలు
అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.) అమరావతి,అమరావతిలో జరుగుతోన్న ఏపీ శాసన మండలి సమావేశాలు ఎనిమిదో రోజైన ఇవాళ ఉద్రిక్తంగా మారాయి. తిరుమల నెయ్యి కల్తీ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ గందరగోళంగా మారింది. ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు త
అమరావతిలో జరుగుతున్న ఏపీ శాసన మండలి.సమావేశాలు


అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.)

అమరావతి,అమరావతిలో జరుగుతోన్న ఏపీ శాసన మండలి సమావేశాలు ఎనిమిదో రోజైన ఇవాళ ఉద్రిక్తంగా మారాయి. తిరుమల నెయ్యి కల్తీ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ గందరగోళంగా మారింది.

ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు తిరుమల నెయ్యి అంశంపై చర్చ జరపాలని వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే, మండలి చైర్మన్ దీనిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీనిని నిరసిస్తూ వైసీపీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు.

మరింత ముదరి వైసీపీ సభ్యులు ఏకంగా చైర్మన్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ చర్యతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande