కోఠి కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులంతా అరెస్ట్
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠి (Koti) ఎస్బీఐ ఏటీఎం వద్ద కేరళ (Kerala) వ్యాపారిపై కాల్పులు జరిపి నగదు దోచుకున్న కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తాజాగా నిందుతులందరినీ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది.
కోఠి కాల్పుల ఘటన


హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)

హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠి (Koti) ఎస్బీఐ ఏటీఎం వద్ద కేరళ (Kerala) వ్యాపారిపై కాల్పులు జరిపి నగదు దోచుకున్న కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తాజాగా నిందుతులందరినీ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు నిందితుల నుంచి ఓ వెపన్ కూడా రికవరీ చేశారు. ఫిబ్రవరి 16న కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిని ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసులు హర్యానా (Haryana)లో చాకచక్యంగా పట్టుకున్నారు. అతడు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ఉత్తరప్రదేశ్లో గాలించగా అతడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేసులో నిందితులంతా పట్టుబడినట్టైంది. ఈ మేరకు వారిని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కాగా, కేరళకు చెందిన వస్త్ర వ్యాపారి రిన్షద్ (Rinshad), వ్యాపార నిమిత్తం హైదరాబాద్కు వచ్చి నాంపల్లి (Nampally)లో ఉంటున్నారు. జనవరి 31న ఉదయం సుమారు 7 గంటల సమయంలో కోఠిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం వద్ద రూ.6 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా, దుండగులు అతడిపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ కాలికి తగలడంతో గాయపడిన రిన్షద్ నుంచి నగదు బ్యాగును, ఆయన స్కూటీని లాక్కొని నిందితులు పరారయ్యారు. అయితే, ఈ ముఠాకు హైదరాబాద్లో ఆశ్రయం కల్పించి, దోపిడీకి సహకరించిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande