
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
మూసీ పునరుజ్జీవన పథకం (Musi
లో భాగంగా తెలంగాణ
Revitalization Project) ప్రభుత్వం 'గాంధీ సరోవర్' (Gandhi Sarovar) ప్రాజెక్టు కోసం వడివడిగా భూసేకరణ ప్రక్రియను చేపడుతున్నది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ కోసం సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే భూసేకరణలో భాగంగా బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏమో కానీ.. తాము చెట్టుకొకరు, పుట్టకొకరులా విడిపోయే పరిస్థితి వచ్చిందని పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం, సీఎంవోకు ట్యాగ్ చేస్తూ తుషార్ గాంధీ ట్వీట్..
అయితే, 'గాంధీ సరోవర్' ప్రాజెక్టును ఉద్దేశించి గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ (Tushar Gandhi) సీఎం రేవంత్ రెడ్డితో పాటు, సీఎంవోను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టడం అస్సలు సరికాదని అన్నారు. బాపు బతికి ఉంటే 'నా పేరు మీద ఇలాంటివి చేయొద్దు, వెంటనే ఆపండి' అని చెప్పేవారని పేర్కొన్నారు. విగ్రహాల కంటే ప్రజల కనీస అవసరాలే ముఖ్యమని గాంధీజీ నమ్మేవారని, అటువంటిది ఆయన విగ్రహం కోసమే పేదల ఇళ్లను తొలగించడం ఆయన సిద్ధాంతాలకు విరుద్ధం' అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు