తిరుమలలో శ్రీవారి భక్తులకు బిగ్.అలెర్ట్
అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.) తిరుమలలో శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 23న) మే నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లు రిలీజ్ కానుండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక
తిరుమలలో శ్రీవారి భక్తులకు బిగ్.అలెర్ట్


అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.)

తిరుమలలో శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 23న) మే నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లు రిలీజ్ కానుండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. ఇక, రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.

మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటలకు పైగా సమయం పడుతుంది. అయితే, నిన్న శ్రీవారిని 76, 506 మంది భక్తులు దర్శించుకున్నారు. 28, 049 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ. 4.2 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande