
అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానున్నాయి. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిబంధన పెట్టారు. ఒక్క నిమిషం ఆలస్యం అయిన నిబంధనల ప్రకారం విద్యార్ధులకు పరీక్ష హాల్ లోకి నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వెలుతురు ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
అయితే, ప్రతి పరీక్ష గదిలోనూ సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు జిల్లా స్థాయి పరీక్ష కమిటీలను కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్, సిట్టింగ్ స్వ్కాడ్ లు నిరంతరం తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యార్ధులు సకాలంలో ఎగ్జామ్స్ సెంటర్ లకి చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రం దగ్గర ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ