అమరావతిలో.నీ వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక.సాంకేతిక ప్రయోగ శాలలు
అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.) చారిత్రక అమరావతిలోని వ్యవసాయక్షేత్రంలో ఆధునిక సాంకేతిక ప్రయోగశాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రయోగశాలలపై ఐదేళ్లపాటు వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో భవనాలు పగుళ్లు రావడంతోపాటు పరిసరాల్లో ప
అమరావతిలో.నీ వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక.సాంకేతిక ప్రయోగ శాలలు


అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.) చారిత్రక అమరావతిలోని వ్యవసాయక్షేత్రంలో ఆధునిక సాంకేతిక ప్రయోగశాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రయోగశాలలపై ఐదేళ్లపాటు వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో భవనాలు పగుళ్లు రావడంతోపాటు పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగి రూ.7.30 కోట్లతో నిర్మించినవి నిరుపయోగంగా మారాయి. ఈ పరిస్థితిపై ‘ఈనాడు’లో వరుస కథనాలు రావడంతో కూటమి ప్రభుత్వం స్పందించింది.

వ్యవసాయ క్షేత్రంలో డీఎన్ఏ వేలిముద్రలు, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ ప్రయోగశాలతో పాటు ప్రాంతీయ డీకోడింగ్ కేంద్రం, మరో రెండు భవనాల నిర్మాణానికి కేంద్రం 2017లో రూ.7.30 కోట్లు మంజూరు చేసింది. 2018లో మొదలైన పనులు 2021 నాటికి పూర్తయ్యాయి. గత వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు వ్యవసాయశాఖకు భవనాలు అప్పగించలేదు. నాటి నుంచి వృథాగా ఉండటంతో చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడం, సామగ్రి చోరీకి గురవడం, ప్రయోగశాల అద్దాలు కొన్ని పగిలిపోయి అధ్వానంగా తయారయ్యాయి. గతంలో నాసిరకంగా పనులు చేసిన గుత్తేదారుకు రూ.35 లక్షల జరిమానా విధించిన సొమ్ముతోపాటు మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం రూ.1.58 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. మార్చిలో ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకురావడానికి వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande