అమెరికా దాడుల భయం.. ఇరాన్లో పరిస్థితి ఉద్రిక్తం.. భారత పౌరులకు ఎంబసీ అడ్వయిజరీ..!
న్యూఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.) ఏ క్షణమైన ఇరాన్ పై అమెరికా (USA) దాడులు చేయవచ్చునన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో ఆ దేశంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు అక్కడి మన మెంబర్షి(Indian Embassy) తాజాగా అడ్వయిజ
Iran tension


న్యూఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.)

ఏ క్షణమైన ఇరాన్ పై అమెరికా (USA) దాడులు చేయవచ్చునన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో ఆ దేశంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు అక్కడి మన మెంబర్షి(Indian Embassy) తాజాగా అడ్వయిజరీ జారీచేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది.

'ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వయిరీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు (విద్యార్థులు, యాత్రికులు వ్యాపారవేత్తలు, పర్యాటకులు) కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్ను తక్షణమే విడిచిపెట్టి వెళ్లండి. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఇరాన్లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండండి' అని ఇరాన్లోని భారత ఎంబసీ తన అడ్వయిజరీలో పేర్కొన్నది.

అలాగే తాజా పరిణామాల సమాచారం కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని సూచించింది. భారతీయులంతా పాస్పోర్ట్లు, ఐడీ కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి సాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఎంబసీ వద్ద మీ పేర్లు నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలి' అని భారత ఎంబసీ తన అడ్వయిజరీలో తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande