26/11 నిందితుడు తహవూర్ రాణాకు కెనడా షాక్.. పౌరసత్వం రద్దుకు రంగం సిద్దం!
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ముంబయి 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాకు బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. తహవూర్ పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను కెనడా ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లుండి భారత పర్యటనకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ రాబోతు
ముంబై దాడి


హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)

ముంబయి 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాకు బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. తహవూర్ పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను కెనడా ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లుండి భారత పర్యటనకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ రాబోతున్న వేళ ఈ పరిణామం ఆసక్తిగా మారింది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలను పునరుద్ధరించేందుకు, ప్రస్తుత కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 26న భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందే కెనడా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పాకిస్థాన్లో జన్మించిన రాణా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. లష్కరే తోయిబా ఆధ్వర్యంలో జరిగిన ముంబై దాడుల కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నాడు.

పౌరసత్వ రద్దుకు కారణం ఇదే:

కెనడా పౌరసత్వం కలిగి ఉన్న తహవూర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న కెనడా నిర్ణయం వెనుక ఉగ్రవాద ఆరోపణలు కాదని తెలుస్తోంది. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం (ఐఆసీ౯సీ) ప్రకారం ఆయన 2001లో కెనడా పౌరసత్వం పొందే సమయంలో తప్పుడు వివరాలు సమర్పించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకోబోతోంది. పౌరసత్వం కోసం సమర్పించిన దరఖాస్తులో తాను కెనడాలో నాలుగేళ్లపాటు నివసించానని, ఆ సమయంలో కేవలం ఆరు రోజులు మాత్రమే దేశం వెలుపల ఉన్నానని కెనడా అధికారులకు రాణా వెల్లడించారు. కానీ రాయల్ కెనడీ మౌంటెడ్ పోలీసుల దర్యాప్తులో రాణా ఆ సమయంలో ఎక్కువ భాగం అమెరికాలోని షికాగాలో గడిపినట్లు తేలింది. అక్కడ ఆయనకు సొంత ఆస్తులు మరియు వ్యాపారాలు (ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ, గ్రోసరీ స్టోర్) ఉన్నట్లు గుర్తించారు. ఇది తీవ్రమైన మరియు ఉద్దేశపూర్వక మోసంగా కెనడా ప్రభుత్వం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఈ కథనం పేర్కొంది.

గతేడాది భారతకు అప్పగింత:

26/11 ఎటాక్ లో కీలక సూత్రధారిగా ఉన్న తహవూర్ రాణాను గతేడాది అమెరికా భారత్కు అప్పగించింది. రాణాను తమకు అప్పగించాలంటూ భారత్ చాలా కాలంగా న్యాయపోరాటం చేసింది. అయితే భారత ప్రయత్నాలను సవాలు చేస్తూ అతడు పలు ఫెడరల్ కోర్టులతో పాటు శాన్ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఆయా న్యాయస్థానాల్లో అతడికి చుక్కెదురైంది. ఈక్రమంలో అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయగా అక్కడా నిరాశే ఎదురైంది. అక్కడ అతడికి ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిసిపోవడంతో గతేడాది అతడిని ఎన్ఐఏ అధికారులు భారత్ కు తీసుకువచ్చి విచారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande