ఢిల్లీకి మూటలు పంపేందుకే సీఎం దేవాదుల పర్యటన: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
హనుమకొండ, 23 ఫిబ్రవరి (హి.స.) ప్రాజెక్టు వ్యయం పెంచి కాంట్రాక్టర్లను మభ్యపెట్టి రూ.1000 కోట్ల నిధులను ఢిల్లీకి పంపేందుకే సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారని తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్
Rajaiya


హనుమకొండ, 23 ఫిబ్రవరి (హి.స.)

ప్రాజెక్టు వ్యయం పెంచి కాంట్రాక్టర్లను మభ్యపెట్టి రూ.1000 కోట్ల నిధులను ఢిల్లీకి పంపేందుకే సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారని తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ తో కలిసి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలు జోకర్ మాటలా ఉన్నాయని అన్నారు. హరీష్ రావు వచ్చిన 24 గంటలు దాటక ముందే భయపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి వచ్చి వరంగల్ పర్యటన చేశారని అన్నారు. ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రి మాటలకు పొంతన లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని అన్నారు.

ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులతో కలిసి వచ్చి దేవాదుల పర్యటించి గాలి మాటలు చెప్పి గాలిలో పోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హరీష్ రావు పర్యటించిన 24 గంటలు గడవక ముందే ముఖ్య మంత్రి మంత్రులతో కలిసి వచ్చి దేవాదుల ప్రాజెక్టు పైన మాయమాటలు చెప్పి మరోసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande