వారసత్వ ఆస్తుల బదిలీకి బ్రేక్.. గిఫ్ట్ డీడ్ ఆప్షన్ మాయం!
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) భూభారతి పోర్టల్లో వారంరోజులుగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అధికారుల నుంచి కనీస సమాచారం లేదు. దీంతో తమ వద్దకు వస్తున్న ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాక మీసేవా కేంద్రాల నిర్వాహకులు తలలు
Gift dead


హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) భూభారతి పోర్టల్లో వారంరోజులుగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అధికారుల నుంచి కనీస సమాచారం లేదు. దీంతో తమ వద్దకు వస్తున్న ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాక మీసేవా కేంద్రాల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. సమస్యను తహశీల్దార్ల దృష్టికి తీసుకెళ్తే.. గిఫ్ట్ డీడ్ కాకుంటే సేల్ డీడ్ చేసుకోమని సలహా ఇస్తున్నారని పేర్కొంటున్నారు. వాస్తవానికి సేల్ డీడ్, పార్టీషన్ డీడ్తో పాటే గిఫ్ట్ డీడ్ ఉండడం ఆనవాయితీ. ధరణి పోర్టల్ అమలులో ఉన్న గిఫ్ట్ డీడ్ భూభారతిలోనూ కంటిన్యూ అయింది. తండ్రి నుంచి వారసులకు ఆస్తిని సులభంగా బదిలీ చేసేందుకు ఉపయోగపడే ఈ విధానంలో స్టాంప్ డ్యూటీ కూడా తక్కువే ఉంటుంది. అయితే గత నెలలో వెలుగుచూసిన స్టాంప్ డ్యూటీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆప్షన్లను నిలిపివేసిందా? లేక ఇది కేవలం సాంకేతిక లోపమా? అనే దానిపై స్పష్టత రావడం లేదు. వారసుల పేరిట కొందరు గిఫ్ట్ డీడ్ విధానాన్ని దుర్వినియోగం చేస్తే జాయింట్ రిజిస్ట్రార్లు అప్రమత్తంగా ఉండి ఆ పత్రాలను రద్దు చేయొచ్చు. కానీ పోర్టల్ నుంచి మొత్తానికే ఆ ఆప్షన్ను ఎత్తివేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస క్లారిటీ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తుండడంతో గిఫ్ట్ డీడ్ ఆప్షనన్ను శాశ్వతంగా తొలగిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది.

భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్ మాడ్యూల్ తెరుచుకుంటున్నా ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

రిజిస్ట్రేషన్ టైప్, నేచర్ ఆఫ్ డీడ్ (గిఫ్ట్), నేచర్ ఆఫ్ సబ్ డీడ్ (గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్), పట్టాదార్ పాస్ బుక్ నంబర్ ఎంట్రీ తర్వాత ప్రాపర్టీ డిటేయిల్స్లోకి వెళ్తున్నది. అది పూర్తి చేసిన తర్వాత డోనర్ ఎవరు అనే అంశాన్ని పూర్తి చేయొచ్చు. ఇక నాలుగో స్టెప్ భూమి గ్రహీత (డోనీ) నుంచి ఆప్షన్ ముందుకు వెళ్లడం లేదు. రిటర్న్ వస్తుంది. ఇది టెక్నికల్ ఇష్యూనా? లేదంటే గిఫ్ట్ డీడ్ ఆప్షన్ని తాత్కాలికంగా నిలిపివేశారా? అన్నది కూడా తెలియడం లేదు. ఇది లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేల్ డీడ్కు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం గిఫ్ట్ డీడ్ రాకపోతే సేల్ డీడ్కి వెళ్లాలంటూ అధికారులు సలహాలు ఇస్తుండడం గమనార్హం. మరోవైపు స్టాంప్ డ్యూటీ ఆదాయాన్ని పెంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

భూభారతి పోర్టల్ ద్వారా పెండింగ్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి కేవైసీలో సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో ధరణిలో ఉన్నట్టే భూభారతిలోనూ విత్ పాస్ బుక్, వితౌట్ పాస్ బుక్తో మ్యుటేషన్ చేసుకునే వీలుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande