రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. హరీష్ రావు
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలిచిన,
హరీష్ రావు


హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని,

ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలిచిన, పోటీ చేసిన కౌన్సిలర్లు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హరీష్ రావు నివాసంలో ఈ మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా వారిని ఆయన శాలువాలతో సన్మానించి అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని చోట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి చెందిన విషయాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గుర్తు చేస్తూ, అధికారం అడ్డం పెట్టుకొని ఎన్నో కుట్రలు చేసినప్పటికీ బిఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల మద్దతుతో బలంగా నిలిచారని అన్నారు. గెలుపొందిన కౌన్సిలర్లతో పాటు పోరాడి ఓడిన అభ్యర్థులను కూడా అభినందిస్తూ, వారి పోరాటస్ఫూర్తిని కొనియాడారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో రానున్నది. బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు, అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande