కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి తీవ్ర అస్వస్థత..
కామారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(MLA Venkataramana Reddy) ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు, మూడు రోజులగా రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, ఎమ్మెల్య
BJP MLA


కామారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.)

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(MLA Venkataramana Reddy) ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు, మూడు రోజులగా రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, ఎమ్మెల్యే ప్రస్తుతం పోలీసులు బందోబస్తు మధ్య గృహ నిర్బంధంలో ఉండగా.. వైద్యులను నేరుగా ఆయన నివాసానికే పిలిపించి ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బ్లెడ్ శాంపిల్స్ను సేకరించి, పరీక్షలకు పంపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేకు ఇంటి వద్దే మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని రోజులు ఎమ్మెల్యేకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

కాగా, ఇటీవల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande