
నారాయణపేట, 23 ఫిబ్రవరి (హి.స.)
గ్రామీణ ప్రాంతంలో మట్టిలోమాణిక్యాలాంటి క్రీడాకారులను వెలుగు తీయడానికే రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీ ప్రవేశపెట్టి సీఎం సెకండ్ ఎడిషన్ కప్పులను 12 జిల్లాల్లో నిర్వహిస్తుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో సీఎం సెకండ్ ఎడిషన్ కబడ్డీ వేదిక అయిందని తెలిపారు. సోమవారం సీఎం ఎడిషన్ సెకండ్ పోటీల్లో గద్వాల్ జిల్లా మహిళా, వనపర్తి జిల్లా పురుష విభాగంలో గోల్డ్ మెడల్ వారికి లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పురుష, మహిళా విభాగంలో వెండి పథకాలు సాధించగా వారికి నగదు 75 వేల రూపాయలు అందజేశారు. మహిళా విభాగంలో కాంస్య పథకం కరీంనగర్ జిల్లాకు కైవసం చేసుకోగా.. గద్వాల జిల్లా పురుషుల కైవసం చేసుకోగా వారికి రూ.50 వేల నగదును అందజేశారు. సాధించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్లోబల్ సబ్మిట్ నిర్వహించాక గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను వెలుగు తీసేందుకుగాను క్రీడపాల్సిన ప్రవేశపెట్టిందని అందుకు కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తుందని తెలిపారు.ఈ సంవత్సరం ఇళ్లలో 12 ఈవెంట్లను నిర్వహిస్తుండగా.. గత ప్రభుత్వాల పాలకుల నిర్లక్ష్యానికి గురైన మక్తల్ నియోజకవర్గం కబడ్డీ క్రీడాను వేదికై నాలుగు రోజులపాటు క్రీడాలు నిర్వహించగా పాల్గొన్న క్రీడాకారులకు మౌలిక వసతులతో పాటు ఆట నిర్వహణ ప్లే గ్రౌండ్ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడంలో సౌకర్యాలు కల్పించడంలో చిన్న పొరపాటు జరగకుండా నిర్వహించిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు