ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు మించి విద్యను అందించాలి.. కలెక్టర్ బి.చంద్రశేఖర్
నల్గొండ, 23 ఫిబ్రవరి (హి.స.) ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు మించి విద్యను అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ చెప్పారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస
Nalgonda collector


నల్గొండ, 23 ఫిబ్రవరి (హి.స.)

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు మించి విద్యను అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ చెప్పారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా 9వ తరగతి గణితం తరగతిలోకి వెళ్లి విద్యార్థులతో చర్చిస్తూ స్వయంగా గణిత పాఠాలను బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని, ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలని, లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలని విద్యార్థులకు సూచించారు. గణితంలో తడబాటు గురవుతున్న అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు వివరించి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande