కిష్త్వార్లో ఆపరేషన్ త్రాషి-I విజయవంతంపై మేజర్ జనరల్ ఏపీఎస్ బాల్ ప్రెస్ మీట్
న్యూఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.) జమ్మూ కశ్మీర్ లోని కిస్త్వార్ ఆదివారం ఆపరేషన్ త్రాషి-1 (Operation Thrashi-l) నిర్వహించి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ పట్టుదల, స్పష్టమైన ఆలోచన, సరైన ప్
Operation


న్యూఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.)

జమ్మూ కశ్మీర్ లోని కిస్త్వార్ ఆదివారం

ఆపరేషన్ త్రాషి-1 (Operation Thrashi-l) నిర్వహించి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ పట్టుదల, స్పష్టమైన ఆలోచన, సరైన ప్రణాళికకు ఒక చక్కని ఉదాహరణ అని మేజర్ జనరల్ ఏపీఎస్ బాల్. (Major General APS Ball) అభివర్ణించారు. గత కొన్ని నెలలుగా అన్ని భద్రతా దళాలు, ఏజెన్సీలు సమగ్ర విధానం తో చేసిన అవిశ్రాంత కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జవాన్ల నుండి ఉన్నతాధికారుల వరకు సమన్వయంతో, ప్రశాంతంగా, సమిష్టిగా పని చేయడం వల్లే ఈ ఆపరేషన్ నిర్ణయాత్మక విజయాన్ని అందుకుందని తెలిపారు. అందరూ ఎంతో

ఈ ఆపరేషన్ యొక్క అతిపెద్ద విజయం ఏమిటంటే, మన సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు కాకుండా లక్ష్యాన్ని పూర్తి చేయడం. అయితే, ఈ ఆపరేషన్ ను మొదట ప్రారంభించి, వీరోచితంగా పోరాడిన శునకం 'టైసన్' (Tyson) ఈ క్రమంలో ప్రాణత్యాగం చేసింది. టైసన్ మినహా మన దళాలన్నీ సురక్షితంగా ఉన్నాయని ఆయన ధృవీకరించారు. ఈ ఆపరేషన్ విజయంలో డీజీపీ, ఆర్మీ కమాండర్ నుంచి అట్టడుగు స్థాయి సైనికుల వరకు ప్రతి ఒక్కరి సహకారం ఉందని మేజర్ జనరల్ ఏపీఎస్ బాల్ మీడియాకు చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande