నారాయణఖేడ్లో రియల్ మోసం.. అక్రమ వెంచర్లపై అధికారుల నిఘా!
నారాయణఖేడ్, 23 ఫిబ్రవరి (హి.స.) నారాయణఖేడ్లో అక్రమ వెంచర్లపై అధికారులు విచారణ చేపట్టారు. మోసపోయిన బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్ ప్రాంతంలో అన్ని మండలాలలో అధికారులు విచారణ చేపట్టి వెంచర్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు సమ
రియల్ ఎస్టేట్


నారాయణఖేడ్, 23 ఫిబ్రవరి (హి.స.)

నారాయణఖేడ్లో అక్రమ వెంచర్లపై అధికారులు విచారణ చేపట్టారు. మోసపోయిన బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్ ప్రాంతంలో అన్ని మండలాలలో అధికారులు విచారణ చేపట్టి వెంచర్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రాంతానికి ఐఐటి, ఎన్ఐటి, సాఫ్ట్వేర్, పెద్ద పెద్ద ఉద్యోగాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగాలు ప్రశాంత జీవనకోసం గుంట చొప్పున భూములు కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేసిన వారికి, రోడ్డు పక్కన చూయించి రిజిస్ట్రేషన్ చేయించారు. కొందరికి ఎక్కడుందో తెలియక మోసపోతున్నారు. భూమిని మరికొంతమందికి విక్రయించడం අධි వ్యాపారంగా మోసాలకు పాల్పడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు నిరుపేదలు వారి జీవితకాలం కష్టార్జితాన్ని పైసా పైసా కూడబెట్టి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.

ఇతర ప్రాంతంలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ పదవీ విరమణ చెందిన తర్వాత తమ భూమి ఎక్కడుందో చూసుకుంటే, అది కబ్జాకి గురై, డబ్బు రిజిస్ట్రేషన్ ఉండడంతో ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కొనుగోలు చేసే సమయంలో 100 రకాల కాగితాలను పరీక్షించి అన్ని సక్రమంగా ఉన్నాయని భావించి అప్పటి అధికారులు సలహాలు సైతం తీసుకుని పక్కగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం చెల్లించి, మరీ కొనుగోలు చేస్తున్నారు. అప్పటికే కొనుగోలు చేసిన వారి ప్రమేయం లేకుండానే, అదే వ్యక్తులు అవే ప్లాట్లను కొత్త వాళ్లకు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టిస్తూ అమ్మేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande