ప్రజావాణికి పోటెత్తిన బాధితులు.. అదనంగా మరో గంట సమయం..
రాజన్న సిరిసిల్ల, 23 ఫిబ్రవరి (హి.స.) సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు. గత నాలుగు సోమవారాలు జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దయింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరోజు జరిగే ప్ర
Rajanna district


రాజన్న సిరిసిల్ల, 23 ఫిబ్రవరి (హి.స.) సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు. గత నాలుగు సోమవారాలు జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దయింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరోజు జరిగే ప్రజావాణి రద్దు కాగా, జనవరి 28న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జనవరి 2, 9, 16 తేదీల్లో కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి రద్దు చేయబడింది.

ఎన్నికల కోడ్ ముగిసిన క్రమంలో నేడు సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుండగా, నాలుగు వారాల తర్వాత జరుగుతున్న ఈ ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. కాగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. అయితే మధ్యాహ్నం ఒకటిన్నరకు ముగిసే ప్రజావాణి కార్యక్రమం అదనంగా గంట సమయం తో రెండున్నర వరకు కొనసాగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande