సీఎం ఇచ్చిన హామీ నెరవేరేనా..? సింగరేణి ఉద్యోగుల ఎదురుచూపు..
భూపాలపల్లి, 23 ఫిబ్రవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుందోనని సింగరేణి ఉద్యోగసంఘాలు సింగరేణి ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం భూపాల్ పల్లి కి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తప
Singareni


భూపాలపల్లి, 23 ఫిబ్రవరి (హి.స.)

మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుందోనని సింగరేణి ఉద్యోగసంఘాలు సింగరేణి ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం భూపాల్ పల్లి కి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు పేర్లతో ఉన్న సింగరేణి ఉద్యోగుల పేర్లను మార్పు చేస్తామని అందుకు తగు విధమైన చర్యలు తీసుకుంటామని సింగరేణి ఉద్యోగులకుఆయన హామీ ఇచ్చారు. గత 40 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సింగరేణి ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైతే బినామీ పేర్లతో ఉన్న ఉద్యోగులందరికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఆశపడుతున్నారు. సింగరేణి యాజమాన్యం సింగరేణిలో కార్మికులను భర్తీ చేసే క్రమంలో భాగంగా 1986 నుంచి 1989 వరకు సింగరేణి లో పనిచేసే కార్మికులను భర్తీ చేసేందుకై ఎంప్లాయిమెంట్ కార్డు ఉన్న వారందరికీ పరుగు పందెం పెట్టి సింగరేణిలో ఉద్యోగం లో తీసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎంప్లాయిమెంట్ కార్డు లేని వాళ్ళు తమకు దగ్గరగా ఉన్న వారి పేరు మీద పరువు పందెంలో పాల్గొని అందులో గెలిచి ఉద్యోగం సాధించారు. అప్పటినుండి ఫోటో మాత్రం ఉద్యోగం చేసే వ్యక్తిగా పేరు మాత్రం వేరే వారి పేరు పై ఉద్యోగం చేయవలసి వస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande