
వరంగల్, 23 ఫిబ్రవరి (హి.స.)
గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసమే సీఎం కప్ నిర్వహిస్తున్నట్టు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా స్థాయి సీఎం కప్ హన్మకొండ జేఎన్ఎన్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజులుగా ఉత్సాహభరితంగా సాగిన ఈ క్రీడా పోటీలకు ముగింపు పలుకుతూ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించి, భవిష్యత్ లో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డీవైఎస్ఓ అశోక్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు