తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిటీ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.)ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం మరోసారి సుప్రీంకోర్టు (Supreme Court) గడప తొక్కింది. సిట్ (SIT) విచారణ నివేదిక అనంతరం ఏపీ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఒక ఏక
తిరుమల


ఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.)ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం మరోసారి సుప్రీంకోర్టు (Supreme Court) గడప తొక్కింది. సిట్ (SIT) విచారణ నివేదిక అనంతరం ఏపీ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఒక ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanya Swamy) పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్పై విచారణ చేపట్టి సంచలన తీర్పను వెలువరించింది. తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తేల్చి చెప్పింది. అదేవిధంగా ఆ ప్రత్యేక కమిటీ ఓవర్లాపింగ్ కిందికి రాదని కోర్టు స్పష్టం చేసింది.

కాగా, ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసిన తరుణంలో, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడంపై సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సిట్ (SIT), సీబీఐ (CBI), టీటీడీ (TTD)లను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ సమర్పించిన ఛార్జ్షీట్లో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని పేర్కొన్నారు. అయితే సింథటిక్ నెయ్యి, పామాయిల్ వంటి పదార్థాలతో భారీ ఎత్తున కల్తీ జరిగిందని వెల్లడించారు. ఈ నివేదికపై తదుపరి చర్యల కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయగా.. అది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande