కారు ప్రమాదం.లో కాలు పోగొట్టుకుని.విద్యార్ది
హైదరాబాద్,, 24 ఫిబ్రవరి (హి.స.) దుండిగల్: కళాశాలలో సంప్రదాయ దినోత్సవం జరుపుకోవాలనుకున్న విద్యార్థి, ఆసుపత్రిలో మంచానికి పరిమితమయ్యాడు. లైసెన్సు లేకుండా సీనియర్ విద్యార్థి కారు నడుపుతూ ఢీకొట్టడంతో జూనియర్ తన కాలు కోల్పోయాడు. దుండిగల్ ఠాణా సీఐ సతీ
కారు ప్రమాదం.లో కాలు పోగొట్టుకుని.విద్యార్ది


హైదరాబాద్,, 24 ఫిబ్రవరి (హి.స.) దుండిగల్: కళాశాలలో సంప్రదాయ దినోత్సవం జరుపుకోవాలనుకున్న విద్యార్థి, ఆసుపత్రిలో మంచానికి పరిమితమయ్యాడు. లైసెన్సు లేకుండా సీనియర్ విద్యార్థి కారు నడుపుతూ ఢీకొట్టడంతో జూనియర్ తన కాలు కోల్పోయాడు. దుండిగల్ ఠాణా సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన కె.తారకేశ్వరరావు, నాగమణి దంపతులు మూసాపేటలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు దేవిప్రసాద్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 21న కళాశాలలో సంప్రదాయ దినోత్సవం నిర్వహించారు. ఓ కారును అద్దెకు తెచ్చి, బ్యాండ్తో కళాశాలకు కిలోమీటరు నుంచి విద్యార్థులు బయలుదేరారు. డ్యాన్స్ చేస్తున్న దేవిప్రసాద్ విద్యార్థుల గుంపు నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో కారు నడుపుతున్న సాయిగౌడ్ బ్రేకుకు బదులు ఎక్స్లేటర్ ఇవ్వడంతో వాహనం అతడి కాలిపై నుంచి వెళ్లడంతో అది నుజ్జునుజ్జయింది. విద్యార్థి ఎడమ కాలు తీసేయాలని వైద్యులు తెలిపారు. సాయిగౌడ్తో పాటు వాహనాన్ని అద్దెకు ఇచ్చిన యజమానిపై కేసులు నమోదుచేశారు. సీనియర్ విద్యార్థులు గొడవ పడి తమ కుమారుడిని వాహనంతో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని దేవిప్రసాద్ తల్లిదండ్రులు ఆరోపించారు.

Tags:

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande