
విశాఖపట్నం 24 ఫిబ్రవరి (హి.స.)
(: భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కోల్కతా జీఆర్ఎస్ఈ నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ (ఏఎస్డబ్ల్యూ) సామర్థ్యం గల ఐఎన్ఎస్ అంజదీప్ నౌకను ఈ నెల 27న కమిషన్ చేయనున్నట్లు నేవీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఈ నౌకను ఆ రోజు చెన్నై పోర్టులో నౌకాదళ సేవల్లోకి ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ నౌక నిర్మాణంలో డాల్ఫిన్ హంటర్ ఇంజినీరింగ్ సాంకేతికత, హల్మౌంటెడ్ సోనార్ అభయ్ పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వెల్లడించాయి. తక్కువ బరువున్న టార్పెడోలు, రాకెట్ లాంచర్లతో సముద్రతీర నిఘా, శోధన, రక్షణ వ్యవస్థలతో 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించేందుకు 77 మీటర్ల పొడవున నిర్మించిన ఈ నౌకను భారత నేవీ అడ్మిరల్ దినేష్కుమార్ త్రిపాఠి చేతులమీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు ఆ వర్గాలు వివరించ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ