నీతి ఆయోగ్ సీఈవోగా నిధి ఛిబ్బర్
ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.) : నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి ఛిబ్బర్ నియమితులయ్యారు. ఛిబ్బర్కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు మంగళవారం సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. 1994 అఖిల భారత సర్వీసుల్లోని
chibber


ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.) : నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి ఛిబ్బర్ నియమితులయ్యారు. ఛిబ్బర్కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు మంగళవారం సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. 1994 అఖిల భారత సర్వీసుల్లోని ఛత్తీస్గఢ్ క్యాడర్కి చెందిన ఛిబ్బర్.. ప్రస్తుతం నీతి ఆయోగ్లోని అభివృద్ధి పర్యవేక్షణ, మూల్యాంకన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. సీఈవో బి.వి.ఆర్.సుబ్రమణ్యం పదవీకాలం మంగళవారం ముగియడంతో నిధి ఛిబ్బర్కు ఈ బాధ్యతలు అప్పగించింది.

3

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande