
డిల్లీ, 25 ఫిబ్రవరి (హి.స.) వచ్చింది. సంప్రదాయ వీసాల స్థానంలో ఈ-వీసా (Electronic visa)లను అందుబాటులోకి తెచ్చారు. యూకేకు వెళ్లే భారతీయులు ఇకమీదట ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇమిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన షేర్ కోడ్ ఉంటుంది. దీన్ని ఉద్యోగ సంస్థలు, యజమానులు తదితరులతో పంచుకునే అవకాశం కల్పించారు.
ఈ కొత్త పద్ధతిలో పేపర్ ఆధారిత వీసా స్టిక్కర్ల స్థానంలో డిజిటల్ వీసాలను అమలు చేయనున్నారు. డిజిటల్ వ్యవస్థ అయినప్పటికీ.. బయోమెట్రిక్ నమోదు కోసం వీసాదారులు దరఖాస్తు కేంద్రానికి వెళ్లాల్సిందే. అయితే, ప్రాసెసింగ్ సమయంలో పాస్‌పోర్టును అక్కడే వదిలి వెళ్లాల్సిన అవసరం మాత్రం ఉండదు. ఈ-వీసా లేదా ఇతర దస్త్రాలు లేకుంటే విమానయాన సంస్థలు ప్రయాణికులను అడ్డుకునే అవకాశం ఉంటుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు