ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.590 కోట్ల మోసం.. మాస్టర్మైండ్ అతడే..
ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.590కోట్ల మోసం ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ కుంభకోణం సూత్రధారి బ్యాంకు మాజీ ఉద్యోగేనని తేలింది. బ్యాంకింగ్ (IDFC First bank fraud)
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.590 కోట్ల మోసం.. మాస్టర్మైండ్ అతడే..


ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.590కోట్ల మోసం ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ కుంభకోణం సూత్రధారి బ్యాంకు మాజీ ఉద్యోగేనని తేలింది. బ్యాంకింగ్ (IDFC First bank fraud) ప్రక్రియను తారుమారు చేసి ప్రభుత్వానికి చెందిన ఈ నిధులను అతడు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు వెల్లడైంది. దీంతో ఆ మాస్టర్మైండ్ సహా అతడికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

హరియాణా (Haryana)లో చండీగఢ్లోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ శాఖలో జరిగిన మోసం కేసులో నలుగురు నిందితులను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిందితులను రిభవ్ రిషి, అభయ్ కుమార్, అభిషేక్ సింగ్లా, స్వాతి సింగ్లాగా గుర్తించారు. వీరిలో ఇద్దరు గతంలో ఐడీఎఫ్సీ బ్యాంకులో పనిచేసిన ఉద్యోగులు కాగా.. మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులని పోలీసులు తెలిపారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మాజీ మేనేజర్ అయిన రిభవ్ రిషి ఈ మోసానికి మాస్టర్మైండ్ అని, అతడే ఈ కుట్ర మొత్తాన్ని అమలుచేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రిషి చండీగఢ్లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో నిందితులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

హరియాణా ముఖ్యమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన-2.0 స్కీమ్కు సంబంధించిన నిధులను జమ చేసేందుకు ఆ విభాగం అధికారులు 2025 సెప్టెంబరు 26న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో రెండు ఖాతాలు తెరిచారు. తొలుత ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.50కోట్లు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.25 కోట్లు జమ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande