అజిత్ కేసును నీరుగార్చేందుకే.. సీబీఐ దర్యాప్తు!
ముంబై: 24 ఫిబ్రవరి (హి.స.) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి దారితీసిన విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా తప్పు బట్టింది. దర్యాప్తును ఆలస్యం చేసి నీరుగార
అజిత్ కేసును నీరుగార్చేందుకే.. సీబీఐ దర్యాప్తు!


ముంబై: 24 ఫిబ్రవరి (హి.స.) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి దారితీసిన విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా తప్పు బట్టింది. దర్యాప్తును ఆలస్యం చేసి నీరుగార్చేందుకే ఫడ్నవీస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందంటూ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సోమవారం దుయ్యబ ట్టారు. సీబీఐ వద్ద ఇప్పటికే ఏకంగా 7 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు.

వాటిలో 2,500 కేసులకైతే ఏకంగా దశాబ్దానికి అతీగతీ లేదంటూ ఆక్షేపించారు. దర్యాప్తు పేరుతో కాలహరణం చేసే ఈ యత్నాలను తాము అంగీకరించే ప్రసక్తే లేదని రోహిత్ కుండబద్దలు కొట్టారు. విమాన ప్రమాదంపై సీఐడీతోనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన వివరాల్లో 30 శాతాన్ని మాత్రమే బయటపెట్టారని కూడా ఆయన ఆరోపించారు. ప్రమాదంలో బ్లాక్బాక్స్ కాలిపోయిందని చెప్పడంపై పలు అనుమానాలు వెలిబుచ్చారు.

‘‘బ్లాక్బాక్స్ను సురక్షితంగా వెలికితీశారు. దాన్ని అందరూ చూశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నా దగ్గరున్నాయి. ఇప్పుడు అది కాలిపోయిందని చెప్పడం వెనక మతలబు ఏమిటి?’’ అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఏవైనా లోపాలు జరిగినట్టు తేలితే ఫడ్నవీస్ సర్కారు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande