నారాయణపేట జిల్లాలో పెళ్లైన.మూడు రోజులకే.వరుడు ఆత్మహత్య
అమరావతి, 24 ఫిబ్రవరి (హి.స.)పెళ్లి జరిగిన మూడు రోజులకే వరుడు చాకలి రవి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... నర్వ మండల కేంద్రానికి చెందిన చాకలి గోవిందమ్మ, కృష్ణయ్య దంపతుల కుమారుడు చాకలి రవితో ఆ
నారాయణపేట జిల్లాలో పెళ్లైన.మూడు రోజులకే.వరుడు ఆత్మహత్య


అమరావతి, 24 ఫిబ్రవరి (హి.స.)పెళ్లి జరిగిన మూడు రోజులకే వరుడు చాకలి రవి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... నర్వ మండల కేంద్రానికి చెందిన చాకలి గోవిందమ్మ, కృష్ణయ్య దంపతుల కుమారుడు చాకలి రవితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు నగరానికి చెందిన యువతితో ఈ నెల 20న వివాహం జరిపించారు. మరుసటి రోజు నవ దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన రవి భార్యను కొట్టాడు. దీంతో ఆమె కుప్పకూలిపడటంతో కుటుంబ సభ్యులు నర్వ పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మక్తల్కు తీసుకెళ్లారు. ఈ విషయం వధువు కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు హుటాహుటిన నర్వకు చేరుకొని రవి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారు. అనారోగ్యం బారిన పడిన వధువును కర్నూలుకు తీసుకెళ్లారు. మనస్తాపానికి గురైన రవి సోమవారం ఉదయం 6 గంటలకు పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande