
న్యూఢిల్లీ, 25 ఫిబ్రవరి (హి.స.)
న్యాయవ్యవస్థ అవినీతిని NCERT
పాఠ్యపుస్తకంలో పొందుపరచడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థ ప్రతిష్ఠకు ఎవరు భంగం కల్పించిన సహించోమని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్ టీ పుస్తకాల్లో న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం పెట్టడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్బంగా సీజేఐ స్పందిస్తూ దయచేసి కొన్ని రోజులు వేచి ఉండండి. ఈ అంశంపై బార్ అండ్ బెంచ్ అందరూ కలవరపడ్డారు. హైకోర్టు న్యాయమూర్తులందరూ కలవరపడ్డారు. నేను ఈ విషయాన్ని స్వయంగా తీసుకుంటాను. సంస్థను కించపరచడానికి నేను ఎవరినీ అనుమతించను. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ సందర్భంగాసీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ ఎన్సీఆర్టీ పిల్లలకు న్యాయవస్థలో అవినీతి గురించి చెప్పడం తీవ్రమైన అంశం అన్నారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..