నేడు సీఎం చంద్రబాబు . రోజంతా కీలక శాఖలపై సమీక్షలు
అమరావతి, 10 మార్చి (హిం.స)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (మార్చి 10) నాడు ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం సచి
నేడు సీఎం చంద్రబాబు . రోజంతా కీలక శాఖలపై సమీక్షలు


అమరావతి, 10 మార్చి (హిం.స)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (మార్చి 10) నాడు ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

ఉదయం 10.20 గంటలకు సీఎం సచివాలయానికి చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఖనిజ వనరుల వినియోగం, శాఖ పనితీరు, అభివృద్ధి చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీజీఎస్పై సమీక్ష జరగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరును సీఎం పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసానికి చేరుకోనున్నారు. రోజంతా కీలక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని పరిశీలించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande