
విశాఖపట్నం, 15 మార్చి (హి.స.)జనసేన పార్టీ బలోపేతానికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు వ్యాఖ్యానించారు. ఈరోజు(ఆదివారం) విశాఖపట్నం పర్యటనలో భాగంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నాగబాబు పాల్గొని మాట్లాడారు. పార్టీ కుటుంబం లాంటిదని.. హై కమాండ్ ఆదేశిస్తే స్థానిక ఎన్నికల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. జనసేన సభ్యత్వం నమోదుకు అన్నివర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని వివరించారు. గతంలో కంటే సభ్యత్వం రెట్టింపు అయిందని నాగబాబు పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని మధురవాడలో 7వ వార్డు జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నాగబాబు, భీమిలి జనసేన పార్టీ ఇన్చార్జ్ సందీప్ పంచకర్ల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్