మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నా
Elections commission


హైదరాబాద్, 15 మార్చి (హి.స.)దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రకటనతో పాటు వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande