
హైదరాబాద్, 15 మార్చి (హి.స.)నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోంది. రామకోటయ్య నగర్ లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూనే, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) మాట్లాడుతూ..‘రామకోటయ్య నగర్ ప్రజలతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి. నన్ను ఎమ్మెల్యే కంటే మీ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటేనే నాకు సంతోషం. ఏ చిన్న సమస్య ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేయండి, వెంటనే స్పందిస్తా. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని వెళ్దాం’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్