వంట గ్యాస్ కొరతతో దేశ వ్యాప్తంగా చిన్న హోటళ్లు మూత పడుతున్నాయి
అమరావతి, 10 మార్చి (హి.స.) వంటగ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించిన నేపథ్యంలో యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన
వంట గ్యాస్ కొరతతో దేశ వ్యాప్తంగా చిన్న హోటళ్లు మూత పడుతున్నాయి


అమరావతి, 10 మార్చి (హి.స.)

వంటగ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించిన నేపథ్యంలో యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబయి, దిల్లీ బెంగళూరులో పలు హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా తీవ్రంగా ఉంటుందని హోటల్ యజమానులు చెబుతున్నారు.

విశాఖలో కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందని విశాఖ హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. సిలిండర్ల సరఫరా రేపటి నుంచి మరింత తగ్గవచ్చని అన్నారు. విశాఖలో ఇప్పటికే బ్లాక్ మార్కెట్ నడుస్తోందని, పరిస్థితి ఇలాగే ఉంటే నిర్వహణ కష్టంగా మరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై ఇప్పటికే కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చామని హోటల్ యజమానులు చెబుతున్నారు. గ్యాస్ కొరత లేకుండా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ చూడాలని విజ్ఞప్తి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande