
అమరావతి, 10 మార్చి (హి.స.)- ప్రొద్దుటూరు గ్రామీణ, ప్రొద్దుటూరు: అటవీ ప్రాంతంలో పేదలు ఎండు కట్టెలు ఏరుకున్నా చట్టాలంటూ తిప్పలు పెడుతుంటారు అధికారులు. అదే సమయంలో కొందరు రూ. వందల కోట్ల విలువైన భూముల్ని కాజేసినా.. కళ్లెదుటే ఏకంగా భవంతులు కట్టేసినా కిమ్మనడం లేదు. ఆక్రమించిన స్థలాలను విక్రయించి జేబులు నింపుకొన్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అటవీ బాటలోనే రెవెన్యూ అధికారులూ నడుస్తున్నారు. ప్రొద్దుటూరు చుట్టూ ఏటి గట్టు ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనా వీసమెత్తు కదలిక లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ