మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దస్తావేజుల.కేసులో ఇద్దరు నిందితులు పరారీ
మదనపల్లె , 10 మార్చి (హి.స.)మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏగా వ్యవహరించిన ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు బెయి
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దస్తావేజుల.కేసులో ఇద్దరు నిందితులు పరారీ


మదనపల్లె , 10 మార్చి (హి.స.)మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏగా వ్యవహరించిన ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సోమవారం చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 2024 జులై 21న దస్త్రాలు తగులబెట్టారు. ఈ కేసులో ఏ3గా మాధవరెడ్డి, ఏ4గా ముని తుకారాం ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే ముని తుకారం అమెరికాకు వెళ్లిపోయారు. నాటి నుంచి ఆయన జాడ కనిపించలేదు. మాధవరెడ్డిని సీబీసీఐడీ అధికారులు గతేడాది అదుపులోకి తీసుకోగా.. రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రవేశపెట్టారు. సరైన సాక్ష్యాధారాలు చూపించలేదనే కారణంతో రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత పూర్వ ఆర్డీవో మురళిని సీఐడీ అరెస్టు చేయగా కొన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. ఇదే కేసులో సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్తేజ్ బెయిల్పై బయటికొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande