హై కోర్టు.ఆదేశాల.ప్రకారం ఓసీ.బీసీ పదోన్నతుల పై .సమీక్ష
అమరావతి, 10 మార్చి (హి.స.):హైకోర్టు ఆదేశాల ప్రకారం పదోన్నతులపై సమీక్ష చేసి, అర్హులైన ఓసీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఎం.నాగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అమ
హై కోర్టు.ఆదేశాల.ప్రకారం ఓసీ.బీసీ పదోన్నతుల పై .సమీక్ష


అమరావతి, 10 మార్చి (హి.స.):హైకోర్టు ఆదేశాల ప్రకారం పదోన్నతులపై సమీక్ష చేసి, అర్హులైన ఓసీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఎం.నాగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సత్వరమే పదోన్నతులు వస్తున్నాయి. దీంతో అన్ని శాఖల్లో వారి ప్రాతినిధ్యం పెరిగింది. అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఓసీ, బీసీ, మైనార్టీలకు పదోన్నతులు లేక కింది స్థాయి పోస్టుల్లోనే రిటైర్ అవుతున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరికి కూడా న్యాయం చేయాలని సీఎంను కోరుతూ ఆయన ఎక్స్అఫీషియో కార్యదర్శి విజయానంద్కు వినతిపత్రం ఇచ్చాం’ అని తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande