
నల్గొండ 10 మార్చి (హి.స.): జిల్లా నార్కట్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఓ లారీని ఓవర్టేక్ చేస్తూ ఆ వాహనాన్ని తాకుతూ ట్రావెల్స్ బస్సు ముందుకెళ్లింది. దీంతో ఇరు వాహనాల డ్రైవర్లు వాహనాలను రోడ్డు పక్కన ఆపి ఘర్షణకు దిగారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన మరో లారీ వీరిని ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య ఇరుక్కపోయి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను శ్రీనివాస్, బంగారయ్యగా గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ