సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈపీసీ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సమీక్ష జరిపారు.
Chandrababu naidu


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)సచివాలయంలో 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎంల నిర్ణయాలు, సచివాలయం, హెచ్ఓడీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సమీక్ష జరిగింది. అలాగే రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా వివరంగా చర్చించారు.

వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్తో పాటు పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏపీడీసీఎల్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదే సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో గనుల శాఖపై సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande