
మంచిర్యాల, 10 మార్చి (హి.స.)
వారసత్వాల ద్వారా రాజకీయంలోకి
రాలేదని, ఉద్యమాల ద్వారానే రాజకీయ నాయకుడిగా ఎదిగానని అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉందని.. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం తప్పదని మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నాయకులు ఆగడాలు చలాయిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు చేస్తున్నారనే నెపంతో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా దిగిన సమయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం చెన్నూర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. గురి
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేతనపల్లిలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు నమ్మకం ఉన్న నాయకులను గెలిపించుకుంటే ప్రజల తీర్పును ఓర్వలేక అక్రమ దారిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పొందాలని మంత్రి వివేక్ దాడులు చేయిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఆయన అన్నారు. అక్రమంగా కేసులు బనాయించి 16 రోజులు జైలులో పెట్టించి వివేక్ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడని తెలిపారు. తాను ఏసీ రూములలో పెరిగి మంత్రి వివేక్ లాగా వారసత్వం ద్వారా రాజకీయంలోకి రాలేదని ఉస్మానియా సాక్షిగా ఉద్యమ పోరాటాల ద్వారానే నాయకునిగా ఎదిగినానని ఉద్యమ సమయంలో ఎన్నో కేసులను జైలు జీవితాన్ని అనుభవించానని జైలుకు వెళ్లడం కొత్తేమీ కాదన్నారు.
క్యాతనపల్లిలో మంత్రి వివేక్ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఓర్వలేని మంత్రి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడని ఆయన అన్నారు. మంత్రి వివేక్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. చెన్నూరు నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు 45 వేల ఉద్యోగాలు కల్పించాలని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, మంత్రికి దమ్ముంటే 300 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు ప్రజల తరఫున పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు