సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుల పై.దృష్టి.సాధించాలి / సీఎం.చంద్రబాబు
అమరావతి, 10 మార్చి (హి.స.) అమరావతి: తెలుగు వైభవం చాటేలా అమరావతి అభివృద్ధి జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. క్రీడలు, పర్యాటకానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీ
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుల పై.దృష్టి.సాధించాలి / సీఎం.చంద్రబాబు


అమరావతి, 10 మార్చి (హి.స.)

అమరావతి: తెలుగు వైభవం చాటేలా అమరావతి అభివృద్ధి జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. క్రీడలు, పర్యాటకానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం జరిగింది. భూ కేటాయింపులు సహా వివిధ ప్రతిపాదనలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.

పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలన్నారు. మరోవైపు సీబీఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపునకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు, పంచాయతీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాల భూ కేటాయింపునకు అనుమతిచ్చింది. సచివాలయం, హెచ్వోడీ టవర్ల పనులకు రూ.2,316 కోట్లకు పాలనా అనుమతులిచ్చింది. రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande