పెట్టుబడులు పెట్టండి.. బాధ్యత మాది.. ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేశ్ ఆహ్వానం
ముంబైలో జరిగిన ఐఏఏపీఐ ఎక్స్పోలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్లు, వాటర్ పార్క్లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను మంత్రి ఆహ్వానించారు.
AP


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)ముంబైలో ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ పర్యటన కొనసాగుతోంది. 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్(ఐఏఏపీఐ) ఎక్స్పోలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్లు, వాటర్ పార్క్లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, 2024-29 నూతన పర్యాటక పాలసీ ద్వారా ఇన్వెస్టర్లకు రాయితీలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్క్లు, వాటర్ ఫ్రంట్ అట్రాక్షన్స్, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande