సరస్వతి అంత్యపుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, 10 మార్చి (హి.స.) కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అ
కలెక్టర్


భూపాలపల్లి, 10 మార్చి (హి.స.)

కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అంత్య పుష్కరాల ఏర్పాటు పై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, ప్రణాళిక శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంత్య పుష్కరాల కోసం చేపట్టిన అన్ని పనులను ఏప్రిల్ 30 వరకు శాశ్వతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ఘాట్ల వద్ద పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యుత్, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు, భక్తులు సురక్షితంగా స్నానం చేసేలా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వైద్య శాఖ అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని తరచూ పరిశీలిస్తూ సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయ, ఇరిగేషన్, పీఆర్, ఆర్ అండ్ బి, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande