
ఏలూరు,, 10 మార్చి (హి.స.) :కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. బంజారాహిల్స్లో కుటుంబంతో కలసి ఉంటున్న ఆయనకు 3రోజుల క్రితం బ్రెయిన్ స్ర్టోక్ రాగా ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్... కావూరి పరిస్థితిని ఆరా తీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ