నిధులు కేంద్రం దయ కాదు తెలంగాణ హక్కు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు పొన్నం లేఖ
హైదరాబాద్, 10 మార్చి (హి.స.) దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. కేంద
మంత్రి పొన్నం


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన

హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదు.. తెలంగాణ హక్కు అని తెలంగాణ ప్రజలు పనులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ లకు(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చలో తెలంగాణకు సంబంధించి రావాల్సిన నిధులు,పెండింగ్ ప్రాజెక్ట్ లపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చర్చించాలన్నారు.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నారు. మేము దానిని వ్యతిరేకించడం లేదు. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్లో సగం నిధులైన కేంద్రం తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష వద్దు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలన్నారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను ఇంకా విస్మరించడం తగదన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని లక్ష్యాన్ని గౌరవిస్తూ రాష్ట్రాలకు పన్నుల వాటలో న్యాయం చేయాలన్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకుంటోందని తద్వారా రాష్ట్రాల మీద భారాలు మోపుతున్నారు. ఇది సరికాదన్నారు. కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90 శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లు గత పదిహేనులుగా నామమాత్రంగా ఇస్తున్నారు. ఆయా మొత్తాలను పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు. 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదని, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేంద్రం చేయుతనందించాలన్నరు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వివక్ష చూపుతోందన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసు లేదు. ఒక్క ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడం లేదన్నారు. పార్లమెంట్లో తెలంగాణ నుండి బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు.. ఇక్కడి నుండి 8 మంది ఎంపీలుగా గెలిపించినా తెలంగాణపై ఈ వివక్ష తగదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande