ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి : ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
ములుగు, 10 మార్చి (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుందని మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు తమ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ర
ములుగు కలెక్టర్


ములుగు, 10 మార్చి (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుందని మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు తమ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం కలెక్టర్ దివాకర టి.ఎస్. వెంకటాపూర్ మండల కేంద్రంలో, నల్ల గుంట, ఎల్లారెడ్డి పల్లె గ్రామాలలోని నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను, గ్రామాల్లో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటాపూర్, నల్ల గుంట, ఎల్లారెడ్డి పల్లె, గ్రామాల్లో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని.. వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మిగిలినవి ఏ ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ను లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇప్పించి ఇళ్ల నిర్మాణపు పనులు త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణం అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయా అని ఆరా తీశారు. ఏ కారణాల చేత ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో మిగిలి ఉన్న నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా వస్తుందని త్వరగా పూర్తి చేసుకొని ఉగాది పండుగ వరకు గృహ ప్రవేశాలు చేపట్టాలన్నారు. మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదారులు ఏప్రిల్ నెలలో పనులు ప్రారంభించక పోతే రద్దు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రత ద్వారా అనేక రకాల సీజనల్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని స్వచ్చమైన పరిసరాల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande